Tuesday, October 27, 2009

ఏమి వ్రాయాలి???

ఏమిటో సరదాగా మళ్ళీ ఏదైనా వ్రాద్దామా అనిపించింది! బ్లాగ్ పెట్టి ఇన్నాళ్ళు అయ్యింది, కుదురుగా కూర్చుని ఒక్కనాడైనా సరిగ్గాఏమీ చేయలేదనిపించింది. ఏదైనా చేసేముందుగా నాకు ఏమి చేయాలో తెలియాలిగా! బహుశా అది తెలియకనే నేమో అవస్థఅంతా!
పూర్తిగా తెలుగులోనే బ్లాగ్ నడపాలా! లేక పూర్తిగా ఇంగ్లిష్ లో నడపాలా! అన్నది ఒక సందిగ్ధం. కాదులెండి, ఇంతబ్రతుకు బ్రతికి, ఇంటివెనకాల చచ్చినట్లు! ఇంగ్లిష్ లో నడిపే ప్రశక్తే లేదు. పోతే, పూర్తిగా తెలుగులో నడపాలంటే, పాఠకులకు అర్థం కావటం సంగతిఅటుంచి, నాకే అంత భాషా పటుత్వం గానీ, జ్ఞానం గానీ లేవన్నది సత్యం! కనుక బ్లాగ్ తప్పక 'తెంగ్లిష్' బ్లాగ్ గా వుంటుంది. హమ్మయ్య, భాష సంగతి తెల్చేసాను. ఇక పోతే ఏమి వ్రాయాలి అన్నది మరొక సమస్య! బాగా ఆలోచించాకా అనిపించినదేమిటంటే! అమెరికా దేశాల సంగతి ఎలావున్నా, మనదేశంలోనే పిల్లలకి మన సంస్కృతీ, సంప్రదాయాలు తెలియటం కష్టంగా వున్నట్టుగా నాకు మధ్య చాలా అనిపిస్తోంది. అలా అనిపించటం కేవలం నా భ్రమ మాత్రమే కాదని నా ఇండియా ప్రయాణాలు రుజువు చేసాయి. అందుకే కొన్ని ప్రస్థావాలు పిల్లలకి  ఏవిధంగా మానవతా విలువలు ఆచరణంలో అర్థం అయ్యేలా చెప్పాలి అన్నవి కుడా దీనిలోపెట్టాలని ఆలోచన గాఢంగా వున్నది. చూద్దాం దైవ సంకల్పం ఎలా వుంటుందో!

2 comments:

విజయ క్రాంతి said...

రాసేయతమే తర్వాత కథ తర్వాతది . ;-) అల్ ది వెరీ బెస్టు ..

Jayashree Tatavarti said...

విజయ క్రాంతి గారు, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు! మీరు సమయం చేసుకుని వ్రాసినందుకైనా, ఏదో విధంగా బద్ధకించకుండా వ్రాయాలనుకుంటున్నాను. చూద్దాం ఎలా సాగుతుందో మరి. తప్పక అడపా దడపా మీ అభిప్రాయం వ్రాయండి.