Tuesday, November 17, 2009

శ్రీ రామ దర్శనం



 


శ్రీ రఘువీరుడు కోదండ రాముడు సీతమ్మతో నాకు దర్శనమిచ్చాడు
మాయమ్మ తో కలసి నను బ్రోవ తలచాడు .......శ్రీ రఘువీరుడు ....


పుణ్య శబరీ తల్లి అతిధి గా నా స్వామి 
కన్నులంతా తానై నిండి పోయాడు 
దివ్యాంశ సంభూత పోతల దమ్మక్కకు 
కోరి కనిపించి తనకు వాసమడిగిన స్వామి...శ్రీ రఘువీరుడు.....


తల్లి సీతమ్మ కాలి పారాణి దిద్దుతూ..
సిరి సిరి నగవుల నొలికించు నా స్వామి
రామనామమే సతతం చిలుకలు పలుకంగా
మైమరిచి జానకి సమేతుడై నా స్వామి ...శ్రీ రఘువీరుడు......

2 comments:

చిలమకూరు విజయమోహన్ said...

సీతమ్మ,రఘురాముల దర్శనం పొందిన అదృష్టవంతులు మీరు.
word verifiacation తీసివేయగలరు.

Jayashree Tatavarti said...

నా కవితని చదివినందుకు ధన్యవాదాలు. 'వర్డ్ వెరిఫికేషన్' 'స్పాం' తగ్గించేందుకు వుంచాను. ఇబ్బంది కలిగితే క్షంతవ్యురాలిని. తరచు మీ అభిప్రాయాలను తప్పక పంచుకోగలరు.