కార్తీక మాస ప్రాశస్త్యం
కార్తీక మాసం హిందూ నెలలలో ఎనిమదవ మాసం మరియు, ఎంతో పవిత్రమైన కార్యాలకు, ఆధ్యాత్మిక కార్యాక్రమాలకు అనువైన మాసం. ఈ మాసం పరమశివునికి, మహా విష్ణువుకు కూడా ఎంతో ప్రీతికరమైన మాసమని హిందువుల విశ్వాసం ఈ కార్తీక మాసంలో ఎన్నో ముఖ్యమైన పండుగరోజులు వస్తాయి.
కార్తీక మాస గాధ:
పద్మ పురాణంలోని ఉత్తరకాండలో ఈ కార్తీక మాసం యొక్క విశేషత తెలియజేయబడింది. దిలీప చక్రవర్తి ఇహలోక భంధవిముక్తుడై, ఉత్తమలోకాలను చేరుకున్న విధం లాంటి ఎన్నో గాధలు కార్తీక మాస వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ వశిష్ట మహాముని చేవివరించబడ్డాయి. ఒకానొక సమయంలో సత్యభామ కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి వివరించమని కోరింది. కృత యుగములోశంఖాసురుడు' (సోమకుడు) అనే రాక్షసుడు వేదములను అపహరించి, సముద్రములో దాక్కున్నాడని, ఆ అసురుని చంపి, వేదములను ఉద్దరించటానికి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి 'శంఖాసురుని' లేక 'సోమకాసురుని' అంతమొందించి వేదములనుకాపాడెనని శ్రీకృష్ణ పరమాత్మ వివరించాడు.
శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి నాడే మత్స్యావతారమెత్తి వేదములను పునరుద్ధరించాడనిహిందువుల విశ్వాసం.
కార్తీక మాసంలో చేయబడే పూజా కార్యక్రమాలని కార్తీక మాస వ్రతం గా చెబుతారు. ఈ కార్తీక మాస వ్రతానికి కొన్ని నిర్దుష్టమైన నియమాలు వున్నాయి. కార్తీక పురాణం ఈ నియమాలను, పద్ధతులను గురించి వివరంగా తెలియ చెబుతుంది. ఎన్నో హిందూ గ్రంధాలు కుడా ఈ వ్రత నియమాలను వివరిస్తున్నాయి.
కార్తీక మాస వ్రత నియమాలు:
* కార్తీక మాసమంతా కూడా మాంసాహారము ముట్టరాదు. మాంసాహారము తినటం బ్రహ్మహత్యా పాతకముతో సమానము.
* కార్తీక మాసమంతయు భక్తులు ఒకే పుట భోజనం చేస్తారు. ఒక పుట పాలు, పళ్ళు తినవచ్చును. అలా చేయలేకపోయినా, పర్వదినాలైన కార్తీక సోమవారాలు, కార్తీక ఏకాదశి, కార్తీక పూర్ణిమలోనైనా ఏక భుక్తలై వుండాలి. అనగా ఒకేసారి భోజనం చేయాలి.
* ప్రతి రోజు అభ్యంగ స్నానం చేయాలి.
* ప్రతి సాయంత్రం పూజ చేసి వీధి గుమ్మంలో దీపం పెట్టాలి
* కార్తీక పురాణం ఈ మాసం లో చదవటం విశేష ఫలాలను కలిగిస్తుంది. కనీసం ఒక అధ్యాయం ప్రతిరోజూ చదివినా, నాలుగు పుణ్యక్షేత్రాలు (చార్ ధాం) వెళ్ళిన ఫలితం కలుగునని జనుల విశ్వాసము.
సోమవార వ్రతం:
'సోమేశ్వరుడు' అని శివునికి మరో పేరు. 'సోమ' అంటే 'చంద్రుడు'. చంద్రుని తల పై వుంచుకున్నాడు కనుక సోమేశ్వరుడైనాడు.కనుక ఆ 'సోమేశ్వరుని' కటాక్షాన్నికోరుతూ, కార్తీక సోమవారాలు ఉపవవాసం చేస్తారు. ఉపవాసం అంటే కేవలం లంఖణం చేయటం కాదు. 'ఉప' అంటే దగ్గరగా 'వాసం' అంటే ఉండటం. ఎవరికీ దగ్గరగా వుండాలి? భగవంతుడికి దగ్గరగా వుండటం 'ఉపవాసం'.తిండి మానేశాము కనుక దాని మీదే దృష్టి పెట్టుకుంటే దాని వల్ల ఉపయోగం లేదు. ఎక్కువ తినడం వలన జాడ్యం కలుగుతుంది. అదే కాస్త తేలికగా వుంటే కాస్త మనసు, బుద్ధి, అప్రమత్తతగా వుంటాయి.
తులసి వివాహం:
కార్తీక మాసం లో ఇంకొక ముఖ్యమైన రోజు 'క్షీరాభ్ధి ద్వాదశి' లేక 'చిలుకు ద్వాదశి. ఇది పౌర్ణమి కి ముందు వచ్చే ద్వాదశి అనగా పన్నెండవ రోజు. ఈ పర్వదినాన 'తులసి' కి 'శ్రీ మహావిష్ణువు'కి వివాహ మహోత్సవం! ఈరోజు తులసి కోటలో రాసి వుసిరి కొమ్మని పెట్టి వివాహం జరిపిస్తారు. రాసి వుసిరి 'శ్రీ మహావిష్ణు' గా భావించి వివాహ మంత్రాలు చదువుతారు. శ్రీ మహా విష్ణువు నాలుగు నెలలు యోగనిద్రలో వున్నా సమయంలో చాతుర్మాస వ్రతం పాటిస్తారు. ఆషాడ శుక్ల ఏకాదశి లేక శయన ఏకాదశి నాడు చాతుర్మాస దీక్షమొదలై ఉత్థాన ఏకాదశి నాడు అనగా శ్రీ మహావిష్ణువు యొక్క యోగ నిద్ర సమాప్తితో దీక్ష కూడా సమాప్తి అవుతుంది. క్షీర సాగర మధన సమయంలో క్షీర సాగారమునుండీ 'తులసి' ఉధవించి, శ్రీ మహావిష్ణు ను వివాహ
మాడినది అని తులసి వివాహం క్షీరాభ్ధి ద్వాదశి నాడు చేస్తారు.
క్షీరాబ్ధి ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు యోగనిద్ర నుండి మేలుకుని బృందావనానికి మహాలక్ష్మి, బ్రహ్మ సమేతంగా వచ్చాడని అనేక పురాణాలు చెబుతున్నాయి. ఈనాడే దేవతలకీ, అసురులకి మధ్య క్షీర సాగర మధనం సాగినదన్న కధ కుడా వాడుకలో వున్నది. ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలలో క్షీరాభ్ది ద్వాదశి చాలా ప్రాసస్త్యమైన రోజు.
******************************************
క్షీరాభ్ది శయనా నారాయణా..శ్రీలక్ష్మి రమణా నారాయణా..
నారాయణా హరి నారాయణా.. నారాయణా శ్రీమన్నారాయణా
నతజన పరిపాల నారాయణా ...
వైకుంఠ వాసా నారాయణా.. వైదేహి మోహన నారాయణా
నారాయణా హరి నారాయణా.. నారాయణా శ్రీమన్నారాయణా
నరహరి రూపా నారాయణా..
*********************************************
అని వీనుల విందుగా, హృదయానందం తో పాడుకుంటూ...కార్తీక మాసంలో... 'కాళేశ్వర, కరిరాజవరదుల' కటాక్ష వీక్షణాలకై భక్తి శ్రద్ధలతో, ఆర్తిగా ప్రార్థిద్దాము. అరిషడ్వర్గాలైన 'కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యా' లను సాధ్యమైనంత కళ్ళాలతో బిగించి, మన జీవన రధాలని సన్మార్గంలో నడిపించమని మనస్పూర్తిగా ప్రార్ధిద్దాము.
క్షీరాభ్ది శయనా నారాయణా..శ్రీలక్ష్మి రమణా నారాయణా..
నారాయణా హరి నారాయణా.. నారాయణా శ్రీమన్నారాయణా
నతజన పరిపాల నారాయణా ...
వైకుంఠ వాసా నారాయణా.. వైదేహి మోహన నారాయణా
నారాయణా హరి నారాయణా.. నారాయణా శ్రీమన్నారాయణా
నరహరి రూపా నారాయణా..
*********************************************
8 comments:
గోదావరి ఆడపడుచుకి బ్లాగ్ లోకంలోకి స్వాగతం ! మీ టపా సందర్భోచితంగా ఉంది .మరిన్ని మంచిటపాలు గోదావరి తరంగాలు నుండి వెలువడాలని ...అల్ ది బెస్ట్ !
పరిమళం గారికి,
మీరు వ్రాసిన స్వాగత వాక్యాలు చదివి చాలా ఆనందం వేసింది. నేను పెద్ద ఓపికగా వ్రాయను మీలాగా. మీ బ్లాగ్ చూసాను. మీ లాగానే మా అత్తగారు కుడా చక్కగా కంపూటర్ నేర్చుకుని చక చక రెండు బ్లాగ్ లు ఎడా పెడా వ్రాసేస్తున్నారు. నేను ఎప్పుడో వీలు కుదిరినప్పుడు వ్రాస్తుంటాను. మెల్లిగా నా కవితలు కుడా పెడతాను. తప్పక చూసి మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీ బ్లాగ్ చాలా బాగుంది. మీకు స్వతహాగానే రచయిత లక్షణాలున్నాయి. మరి వుంటా.
స్నేహాభిమానాలతో....జయశ్రీ
ఓహో ఇందుకా కార్తీక మాసం చేస్తారు. తెలియని విషయం తెలుసుకున్నా :) మరి కేవలం తెలుగు వారు మాత్రమే చేస్తారెందుకని??
బ్లాగ్లోకానికి స్వాగతం.. మీ అత్తగారు రెండు బ్లాగులు అంటే జ్ఞానప్రసూనగారా??? వేరీ గుడ్డు...కానివ్వండి..
బృహఃస్పతి గారు,
మీరు సద్ హృదయంతో వ్రాసిన వాక్యాలు చదివాను. మీరు మీ సమయం వెచ్చించి నా గోదావరి తరంగాలు చూసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే నేను మీ బ్లాగ్ ఒకసారి త్వరగా చూసాను. మీరు పెట్టిన 'కొటేషన్' చాలా నచ్చింది. చాలా వ్రాసారు తప్పక వివరంగా చూస్తాను ఎందుకంటే, నాకు కవితలంటే సరదా. అదీ మీ పంథా, ఆలోచనా పధ్ధతి కాస్తా నాలా అనిపించింది. నాకు మీ అందరి అంత భాష లో ప్రజ్ఞ గానీ, భావుకత గాని, రచనా ప్రావీణ్యం గానీ లేవు. సరదాగా వ్రాయాలననిపిస్తే, నాకు తెలిసినది కాస్త వ్రాస్తానన్తే! తప్పక నేను పెట్టే కవితల మీద మీ అభిప్రాయాలు వ్రాయండి. కార్తీక మాసం మన తెలుగువాళ్ళే కాక, ఇతర ప్రాంతాలలో కుడా చేసుకుంటారు. కాస్త పద్ధతులలో తేడా. గుజరాతి వారుకూడా ఏకాదశి ఉపవాసం చేస్తారు. ఇంకా ఉత్తర హిందుస్తానం వారింటికి వెడితే ఈసారి, తులసి దగ్గర 108 నూనె దీపాలు వెలిగించారు. పాత టపాలో నర్తకి చదివి చెప్పండి. మరి సెలవా,
స్నేహాభిలాషి,
జయశ్రీ
నమస్తే జ్యోతి గారు,
భలే ఉహించారే ! అవును జ్ఞాన ప్రసూన గారే! బహుశా సవ్యసాచి లా రెండు బ్లాగ్లు నడిపేది ఆవిడ ఒక్కరే కాబోలు. నేను ఈలోకానికి కొత్త. పైగా అంతగా రచనలలో నాకు ప్రవేశం లేదు. వ్రాసేందుకు కాస్త బద్ధకం కుడా! తప్పక అప్పుడప్పుడు చూసి మీ సదభిప్రాయాలు చెప్పండి. మరి వుంటానండి.
స్నేహాభిమానాలతో .. జయశ్రీ.
నాకు మీ అందరి అంత భాష లో ప్రజ్ఞ గానీ, భావుకత గాని, రచనా ప్రావీణ్యం గానీ లేవు.
ఇంత అబధ్ధం ఎలా ఆడారండీ?? ఇప్పుడే మీ నర్తకి చదివాను. మీ మంద్ర మృదంగ లయలు, తరంగితాంతరంగ ప్రయోగాలు నా ఊహకు సైతం అందనివి. నిజంగా మీకు భాషపై మంచి పట్టు ఉంది. నాతో పోల్చి చుస్తే అద్భుతమైన పట్టు ఉంది. భాషపై పట్టు ఉంటే రచన ప్రావీణ్యత దానంతటదే ఉంటుంది. రెండూ విడదీయలేనివి కదా...
మేళవించాను, ముగ్ధనయ్యాను
సంగమించాను, స్వరాన్నయ్యాను
చూడండీ ఎంత అద్బుతంగా చెప్పగలిగారో...
పదాలను కూర్చుకుని భావాన్ని రాబట్టకుండా, భావాన్ని నిర్ణయించుకుని పదాలు కూర్చండి. భావుకత కూడా మరింత స్పష్టంగా, పరిపూర్ణంగా కనిపిస్తుంది.
నమస్తే బృహఃస్పతి గారు,
మీరు వ్రాసిన మైల్ కి ఇంతవరకు జాబు వ్రాయనందుకు క్షంతవ్యురాలిని. కాస్త హడావిడి, పిల్లలు రావటం, అనుకోకుండా కెనడా వెళ్ళవలసి రావటం వలన వ్రాయలేదు. మీ అభిమానానికి, ప్రోత్సాహానికి నిజంగా ధన్యవాదాలు. 'నర్తకి ' వ్రాసి చాలా సంవత్సరాలైంది. అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులువచ్చాయి. భాషలోనేకాదు, భావనా సరళి లో కూడా. తప్పక మీ అభిప్రాయాలు, నిర్మాణాత్మక విమర్శలు కూడా తెలియ చేయండి.
స్నేహాభిమానాలతో.... జయశ్రీ
Post a Comment